telugu navyamedia
సినిమా వార్తలు

రొమాంటిక్ పాత్రలో నటించబోతున్నా : నిహారిక కొణిదెల

niharika

నిహారిక కొణిదెల మొదటి సినిమా ఒక మనసు పరవాలేదనిపంచినా ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొంది నెటిజన్లకు దగ్గరైంది. నిహారిక తాజాగా చిరంజీవి ‘సైరా’ సినిమాలో బోయ పిల్ల పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో సినీ వర్గాల దృష్టి కూడా ఎక్కువగా నిహారిక పై ఉంది. కాగా తాజాగా నిహారిక యాంకర్‌ రవితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె తన పెళ్లి గురించి.. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల గురించి తెలిపింది. ఈ సందర్భంగా పెళ్లి తర్వాత నటిస్తాను లేదా అనే విషయాన్ని ముందుగా చెప్పలేనని పేర్కోంది. ఇంకా ఆమె మాట్లాడుతూ… చాలా వరకు నా వద్దకు వచ్చిన మంచి ఆఫర్లను వదిలిపెట్టకుండా నటిస్తానని చెప్పింది. రొమాంటిక్‌ సినిమాల్లో నటించడం గురించి మాట్లాడుతూ ‘గ్లామరస్‌ పాత్రల్లో కూడా నటించనున్నాను. నా నెక్ట్స్ తమిళ ప్రాజెక్టు రొమాంటిక్‌ జానర్‌లో ఉండబోతోందని గోవాలో ఈ సినిమా షూటింగ్‌ జరగనుందని తెలిపింది.
 

Related posts