telugu navyamedia
సినిమా వార్తలు

ఫ్యామిలీ ఫొటోతో రవి… ఫైర్ అవుతున్న నెటిజన్లు

Ravi-with-family

“ఒక సక్సెస్ ఫుల్ పర్సన్ కంటే ఫ్యామిలీ పర్సన్ చాలా సంతోషంగా ఉంటాడు” అంటూ రవి తాజాగా ఫ్యామిలీ ఫోటోని పోస్ట్ చేశారు. ఇంతకాలం దాచిన నిజాల్ని సోషల్ మీడియా వేదికగా తన భార్య, మూడేళ్ళ కూతురి ఫొటోలతో బయటపెట్టేశాడు. అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రవిపై కొంతమంది నెగెటివ్ గా స్పందిస్తున్నారు. ఎందుకంటే గతంలో రవితో యాంకర్ లాస్యకు ఎఫైర్ ఉందంటూ పుకార్లు వచ్చాయి. ఆ తరువాత లాస్య మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో అప్పుడు చాలామంది లాస్యపై నెగెటివ్ గా కామెంట్స్ చేశారు. దీంతో పలు ఇంటర్వ్యూల్లో లాస్య రవికి పెళ్ళి అయిందన్న విషయాన్నీ బయటపెట్టింది.

కానీ రవి మాత్రం తనను పెళ్ళి కాలేదని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయం ప్రస్తావనకు రాగా… “నాకు పెళ్ళి కాలేదని నిరూపిస్తే మీరు పెళ్ళి చేసుకుంటారా ?” అంటూ యాంకర్ పై మండిపడ్డాడు రవి. దీంతో నిజంగానే రవికి పెళ్ళి కాలేదేమో అని భావించిన చాలామంది లాస్యపై ఫైర్ అయ్యారు. ఇప్పుడు అసలు విషయం తెలియడంతో రవిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇన్ని రోజుల తరువాత రవి తన పర్సనల్ లైఫ్ గురించి బయట పెట్టడానికి కారణమేంటో తెలియాల్సి ఉంది.

Related posts