telugu navyamedia
సినిమా వార్తలు

‘నెట్‌’ మూవీ ట్రైలర్‌

హీరోయిన్‌ అవికాగోర్, క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ కాంబోలో వ‌స్తున్న చిత్రం ‘నెట్’. క్రైం థ్రిల్ల‌ర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైల‌ర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. అవికాగోర్‌.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించగా.. అశ్లీల చిత్రాలు వీక్షించే యువకుడిగా రాహుల్‌ కనిపిస్తాడు. ఈ క్రమంలో ప్రియ ఇంట్లో సీక్రెట్‌ కెమెరాలను ఉంచి వాటి ద్వారా ఆమె ప్రతి కదలికలను గమనించిన రాహుల్‌ చివరకు ఎలాంటి చిక్కుల్లో పడతాడు, ప్రియ జీవితాన్ని సీక్రెట్‌ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ మూవీని రూపొందించారు.

ఈ ట్రైల‌ర్ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. అవికాగోర్ చాలా కాలం త‌ర్వాత తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. భార్గ‌వ్ మాచ‌ర్ల డైరెక్షణ్‌లో వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని త‌మాడా మీడియా బ్యాన‌ర్ పై రాహుల్ త‌మాడా, సాయి దీప్ రెడ్డి బొర్రా నిర్మిస్తున్నారు. జీ 5 ఓటీటీ ప్లాట్ ఫాంలో సెప్టెంబ‌ర్ 10న ఈ మూవీ విడుదల కానుంది.

Related posts