telugu navyamedia
సినిమా వార్తలు

బూజుపట్టిన సంప్రదాయాలు… ఆడపిల్లల వస్త్రధారణపై నాగబాబు కౌంటర్

nagababu1

మెగా బ్రదర్ నాగబాబు “జబర్దస్త్ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నాగబాబు “నా ఇష్టం” అంటూ యూట్యూబ్ ను ప్రారంభించి, తన విమర్శలను దీనిద్వారా కొనసాగిస్తున్నారు. తాజాగా ఇప్పటితరం ఆడపిల్లలు ధరిస్తున్న వస్త్రధారణపై కొంతమంది ప్రముఖులు చేసిన కామెంట్స్ పై “మై ఛానల్ నా ఇష్టం” ద్వారా నాగబాబు స్పందించారు.

“ఈ మధ్య గౌరవనీయులైన కొంతమంది వ్యక్తులు ఆడవాళ్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు. ఆడవాళ్లు సంప్రదాయ బద్ధమైన వస్త్రాలను ధరించాలని వాళ్లు చెప్పారు. అలాంటి వస్త్రధారణ లేకపోవడం వల్లనే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఆడవాళ్లు శరీరాన్ని పూర్తిగా కప్పివుంచే వస్త్రాలను ధరించాలని చెప్పారు. అసలు ఆడపిల్లలు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? అని నేను అడుగుతున్నాను. వంటిని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలను ధరించిన వారిపై కూడా అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలనేది ఆడపిల్లల హక్కు. దానిని కాదనడానికి మీరెవరు? ఆడపిల్లలు ఎప్పుడూ ఎక్కడా మగవారి డ్రెస్సింగ్ గురించి మాట్లాడలేదే. ఎప్పుడండీ మీరు మారతారు? బూజుపట్టిపోయిన సంప్రదాయాలను పట్టుకుని వేళ్లాడుతున్నారు” అంటూ తన అసహనాన్ని ప్రదర్శించారు.

Related posts