telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయశాంతి ‘కర్తవ్యం’ అరుదైన గుర్తింపు

kartavyam

మోహన గాంధీ దర్శకత్వం వహించిన కర్తవ్యం సినిమా 1990లో విడుదలైంది. ఇందులో విజయశాంతి, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో విజయశాంతి అద్భుతంగా నటించారు. ఈ చిత్రం కమర్షియల్‌గానే కాకుండా అవార్డులను సైతం సొంతం చేసుకుంది. విజయశాంతికి ‘జాతీయ ఉత్తమనటి’ అవార్డుతో పాటు ‘ఫిలింఫేర్, నంది’ అవార్డులు లభించాయి. ఇప్పటికీ ఈ సినిమా విడుదలై మూడు దశాబ్దాలు గడిచాయి. అయినా కూడా ఈ చిత్రానికి ఇప్పుడు అరుదైన గుర్తింపు లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ‘నేషనల్ ఫిలిం ఆర్కివ్స్ ఆఫ్ ఇండియా’ ఈ చిత్రం మొక్క తెలుగు, హిందీ పోస్టర్స్‌ను’ రిలీజ్ చేసింది. కర్తవ్యం సినిమా పోస్టర్స్‌ను ఎన్ఎఫ్ఐ’ ట్వీట్ చేయడం తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గుర్తింపు. 

Related posts