telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రియురాలిని పరిచయం చేసిన రానా… సాయితేజ్ రియాక్షన్ ఇదే…!!

Saitej

టాలీవుడ్ మోస్ట్ బ్యాచులర్ లిస్ట్‌లో ఒకడైన రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. తాను ప్రేమించిన అమ్మాయి తనకు ఓకే చెప్పేసిందని తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించిన రానా.. తన పేరు మిహీకా బజాజ్ అని ఫొటో షేర్ చేశారు. బ్యాచ్‌లర్స్‌లో ఒకరైన రానా ఓ ఇంటివాడు కాబోతున్న విషయాన్ని ఇప్పుడు ఆ లిస్ట్‌లో ఉన్న హీరోలు తట్టుకోలేకపోతున్నారు. పెళ్లి అయిన హీరోలందరూ రానాకు శుభాకాంక్షలు తెలుపుతుంటే.. పెళ్లికాని హీరోలు మాత్రం రానాని తిట్టుకుంటున్నారు. ఎందుకంటే.. ఇంత సడెన్‌గా ట్విస్ట్ ఇచ్చాడేంటి అని అంతా ఇప్పుడు రానా పోస్ట్‌కి కామెంట్ కామెంట్ చేస్తున్నారు. దీనికి ఉదాహరణ మెగా హీరో సాయితేజ్ చేసిన పోస్టే. నిద్ర మద్యలో లేచిన ఓ వీడియోని పెట్టి ‘‘ఇది ఒక కల.. గుడ్ నైట్ మళ్లీ పడుకుంటున్నా.. ’’ అని సాయితేజ్ పోస్ట్ చేశారు. సాయితేజ పోస్ట్ పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

Related posts