ప్రస్తుతం సెలబ్రిటీలు అందరు దాదాపు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల అంటూ తమ అభిమానులకు చేరువవుతున్నారు. సినిమా విషయాలనే కాదు పర్సనల్ విషయాలని కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ అభిమాన హీరోలని ఫాలో అవ్వడం అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. అయితే కొన్ని సార్లు సెలబ్రిటీల పేరుతో తప్పుడు ఎకౌంట్స్ క్రియేట్ చేసి నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్నారు కొందరు. దీనిపై ఒక్కోసారి స్టార్స్ స్వయంగా స్పందించి అది ఫేక్ ఎకౌంట్ అని వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి వస్తుంది. తాజాగా అక్కినేని నాగార్జున కూడా తన ట్విట్టర్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ తనది కాదని క్లారిటీ ఇచ్చాడు. నాగార్జున పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో అన్ని నాగ్‌కి సంబంధించిన ఫోటోలు ఉండడంతో పాటు దానికి 10.3 కే ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో అందరు అది నాగ్ పర్సనల్ ఎకౌంటే అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ తన ట్విట్టర్లో ఆ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ నాది కాదు. ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ సమాచారాన్ని తప్పక మీకు అందిస్తానని పేర్కొన్నాడు. నాగ్ ప్రస్తుతం నటిస్తున్న “మన్మథుడు-2” చిత్రం ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This isn’t me…!!https://t.co/ExF7bP9PqB
Will definitely update you all when I am on @instagram— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 15, 2019