telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఎంపీల వేతనాల్లో కోతకు లోక్ సభ ఆమోదం!

parliament india

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంపీ వేతనాల్లో కోతకు లోక్ సభ ఆమోదం తెలింది. కోవిడ్ పై పోరాటానికి నిధులను సమకూర్చడానికి ఏడాది పాటు ఎంపీల జీతాల్లో 30 శాతం కోతను విధించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఏప్రిల్ 6న ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది.

ఎంపీల వేతనాల్లో కోతకు సంబంధించిన బిల్లును ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభలో ఆమోదముద్ర పడింది. మరోవైపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా వేతనాల కోతకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండేళ్ల పాటు నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Related posts