telugu navyamedia
crime culture news trending

కన్న తల్లా ? లేక కసాయా ?… నెలల కూతురిని ఏం చేసిందంటే ?

Mom

అమెరికాలోని టేనస్సీకి చెందిన ఓ మహిళ నెల వయసు గల తన కూతురుతో అమానుషంగా ప్రవర్తించింది. ఒక చేతితో దమ్ము కొడుతూ మరో చేతితో పసికందును పైకి ఎత్తి గాలిలో తిప్పడం చేసింది. అదేదో ఘనకార్యం చేస్తున్నట్టు తన చర్యను ఫేస్‌బుక్‌ లైవ్ వీడియోలో పెట్టిందామె. ఆ వీడియో చూసిన నెటిజన్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే… టైబ్రేషా సెక్స్టన్(24) అనే మహిళ ఈ దారుణానికి పాల్పడిందని హామిల్టన్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఆదివారం చట్టనూగాలోని టైబ్రేషా ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించింది. ఆ చిన్నారి తనకు అవసరం లేదని, పాపను చంపేయాలనే అలా చేశానని పోలీసులతో చెప్పిందట. ఆ సమయంలో ఆమె నుంచి మద్యం సేవించిన వాసన రావడంతో ఇంట్లో వెతికితే ఖాళీ లిక్కర్ బాటిళ్లు కనిపించాయని పోలీసులు పేర్కొన్నారు. టైబ్రేషాపై పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించడం కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 4న ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు.

Related posts

ఏకంగా చెవిలో కాపురం పెట్టిన బొద్దింకలు… అసలేం జరిగిందంటే ?

vimala p

నియంత్రించే వీలున్నా అలా జరగలేదు: చైనాపై ట్రంప్ విమర్శలు

vimala p

భారత్ బచావో ర్యాలీకీ హాజరు కావాలి: కుంతియా

vimala p