telugu navyamedia
సామాజిక

ప్రసాద్ ఐమాక్స్ పై వాణిజ్య పన్నుల శాఖ చర్యలు

Prasad IMAX In Legal Trouble
సినిమా టికెట్లపై ఇంతకుముందే జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినా, థియేటర్ల నిర్వాహకులు మాత్రం ఆ ప్రయోజనాన్ని ప్రేక్షకులకు అందించకుండా అధిక ధరలను కొనసాగిస్తున్నారని, ఆహార ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నాయనే ఫిర్యాదులు అధికం అవుతున్నాయి. 10, 20 రూపాయల ఖరీదు చేసే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కు ప్రేక్షకుల నుంచి వందల్లో గుంజుతున్న మల్టీ ప్లెక్స్ లపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  హైదరాబాద్ లోని ప్రసాద్స్ ఐమాక్స్ పై ఫిర్యాదుల సంఖ్య ఎక్కువవుతుండడంతో వాణిజ్య పన్నుల శాఖ చర్యలు ప్రారంభించింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కె.వినయ్ కుమార్ నేతృత్వంలోని యాంటీ ప్రాఫిటరింగ్ బృందం తనిఖీలు జరిపారు. అధిక జీఎస్టీ వసూలు చేస్తున్న విషయం నిజమేనని తేల్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తామని, ఐమాక్స్ పై చర్యలకు సిఫార్సు చేశామని ఆయన అన్నారు. ఇక తాజా బడ్జెట్ లో సినిమాలపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించారు. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలు మరింతగా తగ్గాలి.

Related posts