telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

మనసే కోయిలై కూసే..

mana prema poetry corner
ఆకాశపు పచ్చని పందిరి క్రింద
విరబూసిన హృదయ వనంలో
వికసించిన ప్రేమ పారిజాతానివి నువ్వు!
నిన్ను చూసిన నిమిషం నుండీ
నా గుండెల్లో వసంతకోయిల కూస్తూనే ఉంది.
నా తొలి వలపు కిరణం
నీ ఊహాల తుషారాన్ని తాకగా
విరిసిన హరివిల్లు నిండా నీ రూపమే!
సంధ్యావీచికనై
నీ ముంగురులతో ఆడుకోవాలని ఆకాంక్ష.
పున్నమి వెన్నెలనై
నీ పెదవుల అంచున మెరవాలని ఆశ
సీతాకోకచిలుకనై  
నీ ఆహ్లాదాన్ని కావాలని కోరిక!
చెరగని చిర్నవ్వునై
నీ పెదవుపై నిలిచిపోవాలని తపన.
కానీ,
నిండా నీళ్లున్నా వర్షించని మేఘాన్ని నేను
మేఘాన్ని వీడలేను…చినుకై కురవలేను!
గుండెకు గొంతుకు మధ్య నాదో తీయటి వేదన!
– సాంబమూర్తి లండ.
     శ్రీకాకుళం

Related posts