telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

బ్రోకర్లను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దు

basti hospital hyd

హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కానున్న బస్తీదవాఖానల్లో సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తికావస్తున్నదని హైదరాబాద్‌ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్ తెలిపారు. బ్రోకర్లు బస్తీ దవాఖానల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అభ్యర్థుల వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు దృష్టికి వచ్చింది. అలాంటి వారిని నమ్మొద్దు. సిబ్బంది నియామకాల్లో ఎలాంటి అవకతవకలకు తావులేదని పేర్కొన్నారు.

బస్తీ దవాఖానల్లో పనిచేసేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో మొత్తం 152పోస్టులకు 3,970మంది దరఖాస్తు చేసుకున్నారు. 90 బస్తీదవాఖానలకు సంబంధించి 94 వైద్య పోస్టులకు 492 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 58 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులకు అత్యధికంగా 3,478మంది అభ్యర్థులు అర్జీ చేసుకున్నట్లు వెల్లడించారు. డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులకు సంబంధించిన . దరఖాస్తుల స్వీకరణతో పాటు పరిశీలన పూర్తయింది. 2న ప్రొవిజినల్‌ వెరిఫికేషన్‌, 7న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహిస్తాం.11న సాయంత్రం వైద్యుల ఎంపికకు సంబంధించిన తుది జాబిత జిల్లా వైద్యాధికారి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపారు.

Related posts