telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విడాకులు తీసుకోవటం వలన బతికిపోయా… భార్యపై సంపత్ కామెంట్స్

sampath

తెలుగు ఇండస్ట్రీలో నటించింది తక్కువ సినిమాలే అయినా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సంపత్ రాజ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు సంపత్. ముఖ్యంగా తన భార్యతో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది కూడా చెప్పుకొచ్చాడు ఈయన. తనకు కేవలం 23 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే పెళ్ళి అయిపోయిందని అప్పుడు తన భార్య వయసు 19 ఏళ్లు మాత్రమే చెప్పాడు సంపత్. మాకు ఓ పాప కూడా పుట్టింది. మాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇద్దరి అభిప్రాయాలతో పాటు దారులు కూడా వేరని అర్థమైపోయిందని చెప్పాడు. ఈయన భార్య కూడా నటే తెలుగులో అప్పట్లో నీరాజనం సినిమాలో హీరోయిన్‌గా నటించిన శరణ్యను పెళ్లి చేసుకున్నాడు సంపత్.

ఒకవేళ విడిపోకపోయుంటే మాత్రం కచ్చితంగా తాను నన్ను చంపడమో.. లేదంటే నేనే తనను చంపడమో జరిగుండేదని చెప్పాడు సంపత్. ఈయనతో విడిపోయిన తర్వాత శరణ్య పొన్నవన్ అనే తమిళ నటుడు, దర్శకుడిని పెళ్లి చేసుకుంది శరణ్య. సంపత్ అలాగే ఉండిపోయాడు. కలిసుండి విడిపోవడం కంటే.. విడిపోయి కలిసుండటమే నయం అని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు ఈయన. ఇద్దరికి ఎలాంటి మనస్పర్థలు లేవని కేవలం లక్ష్యాలు వేరువేరుగా ఉండటంతో ఒకానొక దశలో విడిపోవాలని ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నానని తెలిపాడు ఈయన. విడిపోయినా ఇద్దరం మంచి స్నేహితులమే అంటున్నాడు సంపత్. తన కూతురు బాధ్యత మాత్రం తానే చూస్తున్నానని వాళ్ల అమ్మ అప్పుడప్పుడూ వచ్చి చూస్తుంటుందని చెప్పాడు ఈయన.

Related posts