telugu navyamedia
news political Telangana

ఉత్తమ్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచాడు: జగదీశ్‌రెడ్డి

Jagadish Reddy,KCR

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ్‌ను నమ్ముకుంటే హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలను నట్టేట ముంచాడని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభివృద్ధి నిరోధకుడని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉంటే హుజూర్‌నగర్‌లో మాత్రం ఉత్తమ్ చేతకాని తనం వల్ల అభివృద్ధి కనబడటం లేదని విమర్శించారు.

టీఆర్‌ఎస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. హుజూర్‌నగర్‌లో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామన్నారు. సైదిరెడ్డి యువకుడు, స్థానికుడు. సైదిరెడ్డిని గెలిపించి హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. తన కుటుంబానికి పదవుల యావ తప్ప ప్రజా సమస్యలపై ఉత్తమ్‌కు అవగాహన లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎంపీ ఎన్నికల్లో గెలిచిన ఉత్తమ్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు.

Related posts

తిరుపతి ఎయిర్ పోర్టులో వీఐపీ లాంజ్: కేంద్రం గ్రీన్ సిగ్నల్

vimala p

బందర్ పోర్టుని తెలంగాణకు ఎంతకు అమ్మేశారు: ప్రశ్నించిన దేవిదేని

vimala p

జేఈఈ అడ్వాన్స్ డ్ ఫలితాల్లో.. మహారాష్ట్ర విద్యార్థికి టాప్ ర్యాంక్

vimala p