telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా” మొదటి వారం కలెక్షన్స్

Syeraa

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేశారు. 7 రోజుల్లో 83 కోట్ల షేర్ అందుకుంది సైరా. దసరా సెలవులను బాగా క్యాష్ చేసుకుంటూ రచ్చ చేస్తున్నాడు చిరంజీవి. తొలిరోజు నుంచే తెలుగు రాష్ట్రాల్లో సైరా హవా కనిపిస్తుంది. నైజాంలో 23.70 కోట్ల షేర్ అందుకుంది.. ఆంధ్రాలో కూడా 60 కోట్ల మైలురాయి అందుకుంది సైరా. వీకెండ్‌తో పాటు దసరా సెలవలను సైరా బాగా క్యాష్ చేసుకుంటుంది. ఏడో రోజు 6 కోట్ల షేర్ వసూలు చేసి సైరా అనిపించాడు మెగాస్టార్. ఓవర్సీస్‌లో కూడా 2.4 మిలియన్ మార్క్ అందుకుంది ఈ చిత్రం. హిందీలో మాత్రం సైరా ఊహించిన వసూళ్లు తీసుకురావడం లేదు. ఈ చిత్రం అక్కడ 15 కోట్ల మార్క్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు 83 కోట్ల వసూలు చేసిన సైరా.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ 112 కోట్ల షేర్ వసూలు చేసింది. బాహుబలి 2 తర్వాత తొలి వారం కేవలం తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్లు షేర్ దాటిన తొలి సినిమా ఇదే. ఇక తమిళనాడులో కూడా ఆశించిన స్థాయిలో సైరా వసూళ్ళు రావడం లేదు. కానీ కన్నడలో మాత్రం దుమ్ము దులిపేస్తుంది ఈ చిత్రం. మొత్తానికి సైరా 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 112 కోట్ల షేర్ అందుకుంది. గ్రాస్ దాదాపు 190 కోట్లకు పైగానే ఉంది. ఖైదీ నెం 150 తర్వాత వరసగా రెండోసారి కూడా 100 కోట్ల షేర్ అందుకున్న హీరోగా చరిత్ర సృష్టించాడు మెగాస్టార్. 170 కోట్లు దాటితే కానీ సైరా సేఫ్ అనిపించుకోదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే తెలుగులో మాత్రమే “సైరా” విజయం అందుకునేలా కనిపిస్తుంది. మిగిలిన చోట్ల ఏం జరుగుతుందో చూడాలి.

Related posts