ఇండియా-వెస్టిండీస్ మధ్య మూడో టి20 మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. గయానాలోని ప్రావిడెన్స్ లో జరగాల్సిన ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. వర్షం ఆగితే అంపైర్లు మైదానాన్ని పరీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు.
మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ ఇప్పటికే 2-0తో చేజిక్కించుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన తొలి రెండు టి20 మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధించింది.