telugu navyamedia
news political Telangana trending

ఉగాది తర్వాత ఇల్లు కట్టుకునేందుకు డబ్బులిస్తాం : మంత్రి హరీష్‌రావు

Harish Rao TRS

ఉగాది పండుగ తర్వాత సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులిస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. సంగారెడ్డిలోని నారాయణ ఖేడ్ లో గిరిజన బాలుర రెసిడెన్షియల్ స్కూల్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 70‌ ఏళ్లు కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు ఓట్లు వేశారని… కానీ ఒక్క గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయలేదని విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 52 కొత్త గురుకులాలు రాష్ట్రంలో వచ్చాయని… తండాలను గ్రామ పంచాయతీలుగా తెలంగాణ ప్రభుత్వం మార్చిందన్నారు. తెలంగాణలో ఇంటిగ్రేటేడ్ గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజ్ ప్రారంభిస్తున్నామని…ఇంటర్ అయిన తర్వాత ఐదేళ్లు‌‌ల పాటు డిగ్రీ చదువు చెప్పి పంపుతామని తెలిపారు. 

Related posts

బర్డ్ ఫ్లూ పై అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర పర్యావరణ శాఖ

Vasishta Reddy

అరకులో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

Vasishta Reddy

భారత్ కరోనా అప్డేట్…

Vasishta Reddy