telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దారుణమైన రేప్ సీన్లతో “మర్దానీ 2” ట్రైలర్

Mardaani

నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన తాజా చిత్రం “మర్దానీ 2”. బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. 2014లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మర్దానీ’కి ఇది సీక్వెల్‌గా రాబోతోంది. గోపీ పుత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై తన భర్త ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.వయసవుతున్నప్పటికీ రాణీలో ఉన్న ఆ ఫైర్ ఇంకా అలాగే ఉంది. ఇందులో విక్రమ్ సింగ్ చౌహాన్, శ్రుతి బాప్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా షూటింగ్ జరుగుతోంది. డిసెంబర్ 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఓ అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ అటుగా వెళుతున్న కారును ఆపి లిఫ్ట్ అడుగుతుంది. ఒంటరిగా ఆడపిల్ల దొరికింది అన్నట్లు అతను లిఫ్ట్ ఇచ్చినట్లే ఇచ్చి దారుణంగా రేప్ చేసి బాడీని ఓ నదిలో పడేస్తాడు. ఈ కేసును డీల్ చేయడానికి శివానీ శివాజీ రాయ్ (రాణీ ముఖర్జీ)ని నియమిస్తారు. అత్యాచారానికి గురైన బాధితురాలి డెడ్ బాడీ చూసి హడలిపోతారు. ఆ హంతకుడిని ఎలాగైనా పట్టుకుంటానని శపథం చేస్తుంది. కానీ ఆ హంతకుడు ఆడపిల్లలను హత్య చేస్తూ వారి ముఖాలకు రాణీ ముఖర్జీ మాస్క్‌లు అంటిస్తూ ఉంటాడు. చివరికి ఏం జరిగింది? ఆ రాక్షసుడిని రాణీ ముఖర్జీ పట్టుకోగలిగిందా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.

Related posts