telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాజ్యసభకు ఆదానీ..బిజేపి కొత్త స్కెచ్ ?

ఆదానీ.. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుబేరుడిగా ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ నిలిచిన సంగతి తెలిసిందే. అతి పెద్ద కుబేరుడిగా కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి ఈ ఆదానీ. దేశ నలుమూలలా తన వ్యాపారం విస్తరింపజేసిన అపర మేధావి. తన వ్యాపార విస్తరణలో భాగంగా ఏపీలోనూ తన వ్యాపారాలను ఇప్పటికే ప్రారంభించారు. అయితే, తాజాగా ఆదానీకి రాజకీయంగా ఇక కీలక అవకాశం కల్పించే అంశంలో జగన్ ఢిల్లీ పర్యటనలో ముందు ఒక ప్రతిపాదన వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ సిఎం జగన్ కేంద్రానికి నమ్మకస్తుడుగా ఉంటున్నారు. బీజేపీ తాము చేయలేని కొన్ని నిర్ణయాలు జగన్ ద్వారా అమలయ్యేలా చేస్తోంది. అంబానీ గ్రూపులో కీలక స్థానంలో ఉన్న పరిమల్ నత్వానీకి రాజ్యసభ సీటు విషయంలో బీజేపీ ముఖ్యనేత జగన్ కు సిఫార్సు చేసారు.

బీజేపీ ఇవ్వాలి అనుకుంటే పెద్ద సమస్య కాదు. కానీ, నేరుగా ఇవ్వటం వలన కొత్త సమస్యలు వస్తాయనే కారణంతో..ఆ బాధ్యతలు అప్పట్లో జగన్ కు అప్పగించింది. దీంతో..నేరుగా ముఖేష్ అంబానీ ఏపీ సీఎం నివాసానికి వచ్చారు. పరిమల్ నత్వానీ సైతం ఆయనతో పాటుగా జగన్ వద్దకు వచ్చారు. నత్వానీకి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని కోరారు. అంతే, అంబానీ నేరుగా వచ్చి అడగటంతో జగన్ సైతం కాదన లేని పరిస్థితుల్లో ఓకే చెప్పారు. చెప్పిన విధంగానే వైసీపీ నుండి పరిమళ్ నత్వానీ రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇక, ఇప్పుడు అదే తరహాలో అదానీ విషయంలోనూ జగన్ వద్దకు ప్రతిపాదన వచ్చినట్లుగా  ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 

Related posts