telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్‌ యంగ్‌-స్టైలిష్‌ లుక్‌.. వైరల్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు బర్త్‌ డే సెలబ్రేషన్‌ మొదలైపోయాయి. సోషల్‌ మీడియా వేదికగా ఆయన ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. గ‌త ప‌దిరోజుల నుంచి ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో డిఫ‌రెంట్ యాక్టివిటీస్‌తో మ‌హేశ్ బ‌ర్త్‌డే ను ట్రెండింగ్ చేస్తున్నారు. తాజాగా మ‌హేశ్ పిక్‌ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ఫొటోలో మహేష్‌ యంగ్‌, స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. మహేష్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ చిత్రం నుంచి రేపు (ఆగస్ట్ 9) ఉదయం 9 గంట‌ల 9 నిమిషాల‌కు, బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్‌ను విడుద‌ల చేయనున్నా సంగతి తెలిసిందే.

తాజాగా ‘స‌ర్కారువారి పాట‌’ సినిమా నుంచి విడుద‌లైన పోస్టర్‌లకు అత్య‌ద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ప‌రశురాం తెర‌కెక్కిస్తోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో ఇది వ‌ర‌కెన్న‌డూ లేనంత స్టైలిష్ లుక్‌లో మ‌హేశ్ క‌నిపించ‌బోతున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌వి శంక‌ర్‌, రామ్ ఆచంట గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts