telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సినీ గేయ రచయిత చంద్రబోస్

Subhash-CHandrabose

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటూ మొక్కలు నాగుతున్నారు. ఇందులో భాగంగా సినీ గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి విసిరిన ఛాలెంజ్ స్వీకరించి మణికొండలోని తన నివాసంలో సినీ గేయ రచయిత చంద్రబోస్ మొక్కలు నాటారు. వృక్షో రక్షతి రక్షిత: అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ… ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమమని చంద్రబోస్ అన్నారు. మన జీవితం, సమాజం, భవిష్యత్ పచ్చగా ఉండాలంటే పచ్చని చెట్లే మూలాధారం అని అన్నారు. అనంతరం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అవ్వాల్సిందిగా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్, ప్లేబ్యాక్ సింగర్ ఎం.ఎం.శ్రీలేఖ, సినీ దర్శకులు మున్నాలకు చంద్రబోస్ ఛాలెంజ్ విసిరారు.

Related posts