telugu navyamedia
సినిమా వార్తలు

“కథానాయకుడు” రెండు రోజుల కలెక్షన్స్

NTR-Biopic
దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం “కథానాయకుడు”. బుధవారం రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సక్సెస్ ఫుల్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతోంది. అయితే సినిమా కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్ వర్గాల సమాచారం. ఓవర్సీస్ లో మొదటిరోజు మూడు కోట్లు రాబట్టిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సత్తా చాటలేకపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఓపెనింగ్స్ 30 కోట్లయినా రాబడుతుందనే అంచనాతో ఉన్నారు చిత్రబృందం. కానీ మొదటిరోజు ఈ సినిమా 7 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. రెండో రోజు కలెక్షన్లు బాగా పడిపోయాయి. రెండవ రోజు 1.14 కోట్లను మాత్రమే రాబట్టి, రెండు రోజులకుగానూ మొత్తంగా 8.77 కోట్ల షేర్ ను రాబట్టింది చిత్రం.  
రెండవ రోజు ఏరియాల వారీగా కలెక్షన్స్ :  
నైజాం – రూ. 2.19 కోట్లు 
సీడెడ్ – రూ. 0.95 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.97 కోట్లు 
కృష్ణ – రూ. 0.85 కోట్లు 
ఈస్ట్ – రూ. 0.48 కోట్లు 
గుంటూరు – రూ. 2.14 కోట్లు 
వెస్ట్ – రూ. 0.63 కోట్లు 
నెల్లూరు – రూ. 0.56 కోట్లు 

Related posts