telugu navyamedia
సినిమా వార్తలు

రేపే “చిత్రలహరి” టీజర్

Chitralahari

సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో “చిత్రలహరి” సినిమా రూపొందుతోంది. కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో సునీల్, వెన్నెలకిషోర్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు చిత్రబృందం. రేపు ఉదయం 9 గంటలకు టీజర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో మెగా మేనల్లుడు హిట్ అందుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. వరుస పరాజయాలతో డీలాపడిపోయిన సాయి ధరమ్ తేజ్ కు ఈ చిత్రం హిట్ కావడం చాలా ముఖ్యం. తేజ్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

Related posts