telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరు బ‌ర్త్‌డేకు “వాల్మీకి” కానుక‌… “జ‌ర్ర జ‌ర్ర” వీడియో సాంగ్ ప్రోమో

Valmiki

హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా జిగర్తాండకు ఈ సినిమా రీమేక్. ఈ సినిమాలో తమిళ్ హీరో అథర్వ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు మేక‌ర్స్. ప్రముఖ తమిళ్‌ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటివరకు డిఫరెంట్‌ జోనర్స్‌లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా మరో డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, దీనికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇక తాజాగా చిరు బ‌ర్త్‌డే కానుక‌గా చిత్రం నుండి “జ‌ర్ర జ‌ర్ర” వీడియో సాంగ్ ప్రోమో విడుద‌ల చేశారు. మాస్ ప్రేక్ష‌కుల‌ ఈ సాంగ్ బాగా ఆకర్షిస్తోంది. ఇందులో డింపుల్ హ‌యాతి అనే తెలుగ‌మ్మాయితో వ‌రుణ్ వేసే స్టెప్పులు ప్రేక్ష‌కుల‌కి మంచి కిక్ ఇస్తున్నాయి. మీరు కూడా ఈ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts