telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

16 ఏళ్ల కుర్రాడు యూట్యూబ్ చూసి లక్షాధికారిగా మారాడు

Forex-Treading

యూట్యూబ్ అందుబాటులోకి వచ్చాక చాలా విషయాలను తెలుసుకోవడం యువతకు తేలికగా మారింది. అలాగే యూట్యూబ్ లో వీడియోలు చూసి 55 లక్షలు సంపాదించాడు ఈ 16 ఏళ్ళ కుర్రాడు. వివరాల్లోకి వెళ్తే…. బ్రిటన్‌కు చెందిన ఓ 16 ఏళ్ల కుర్రాడు ఎడ్వర్డ్ టర్నర్ ఫారెక్స్ ట్రేడింగ్ (వివిధ దేశాల కరెన్సీలతో చేసే ట్రేడింగ్) తో చాలా మంది బాగా డబ్బు సంపాదిస్తున్నారని తెలుసుకున్నాడు. తాను కూడా అదే పని చేద్దామని నిశ్చయించుకున్నాడు. అయితే అప్పటికే ఆ బిజినెస్‌లో ఉన్న ఓ వ్యక్తి.. ఎవరైనా సీనియర్ బిజినెస్ అనలిస్ట్ వద్ద శిక్షణ తీసుకోకుండా ట్రేడింగ్ వ్యాపారంలో అడుగుపెడితే ఏమీ సాధించలేమంటూ టర్నర్‌ను నిరాశపరిచాడు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న టర్నర్.. రోజుకు 5 గంటలపాటు యూట్యూబ్‌లో ఫారెక్స్ ట్రేడింగ్‌ గురించిన వీడియోలే చూశాడు. అలా ఈ ట్రేడింగ్‌పై పట్టుసాధించి.. తొలిసారి 150 పౌండ్లు(సుమారు రూ.14000) పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బుతో వ్యాపారం చేస్తూ చివరకు ఎనిమిది నెలల్లోనే ఆ సొమ్ముకు 40 రెట్లు సంపాదించాడు. అవునండీ ఇప్పుడతని వద్ద ఉన్న సొమ్ము రూ. 55 లక్షలపైమాటే. తనకు డ్రైవింగ్ లైసెన్సు వచ్చేనాటికి రూ.27 లక్షలు పెట్టి మెర్సిడెస్ కారు కొనుక్కోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

Related posts