ఏఎంఆర్‌పీ లో లెవల్ కెనాల్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి శనివారం నీటిని విడుదల చేశారు. సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని మంత్రి ఈ సందర్భంగా రైతాంగానికి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నిరందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. ఏప్రిల్ 4 వరకు నీటి లభ్యతను బట్టి ఆన్ అండ్ ఆఫ్ పద్దతిలో గడువు పొడిగించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే హై లెవల్ కెనాల్ ద్వారా 2 లక్షల 20 వేల ఎకరాలకు నీరందించినట్లు తెలిపారు. అదేవిధంగా 225 చెరువులు, కుంటలను నింపినట్లు చెప్పారు.
లో లెవల్ కెనాల్ ద్వారా 50 వేల పైచిలుకు ఎకరాలకు నీరు అందించడంతో పాటు 27 చెరువులను, కుంటలను నింపనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, భాస్కర్‌రావు, నోముల నర్సింహాయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్ర నాయక్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సి.కోటిరెడ్డి, కే.వి. రామారావు తదితరులు పాల్గొన్నారు.