కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు కూటమికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతున్నాయి. బెంగళూరులో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు.
ఈ సమావేశానికి ముందు బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ శాసనసభాపక్ష సమావేశంలో తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని, సీఎం కుమారస్వామి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కుమారస్వామి రాజీనామాను ప్రజలంతా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రేపు కర్ణాటక వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు.
మరోసారి జడేజా పై మంజ్రేకర్ అనుచిత వ్యాఖ్యలు…