telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జాన్వీ కపూర్ అతని కోసం బిర్యానీ చేసిందట… !?

Janvi

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “కార్గిల్ గర్ల్”, “రూహ్ అఫ్జా”, “దోస్తానా-2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ అమ్మడు సినిమా స్క్రిప్ట్స్ ఎంపికలో జాగ్రత్త వహించడమే కాదు ఫిట్‌నెస్ విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తుంటారు. తెరపై అందంగా కనిపించడం కోసం జాన్వీ జిమ్ లో చాలాసేపు కష్టపడుతూ ఉంటుంది. అయితే “దఢక్” సినిమాలో జాన్వీ… ఇషాన్ ఖట్టర్ తో జత కట్టింది. ఇషాన్ కు కూడా ఇదే మొదటి చిత్రం. ఈ చిత్రం తర్వాత జాన్వీ, ఇషాన్ అప్పుడపుడు కలిసి తిరుగుతూ కెమెరా కంటికి చిక్కుతున్నారు. అయితే ఇషాన్ ఖట్టర్ కోసం జాన్వీకపూర్ బిర్యానీ చేసిందట. ఇటీవలే జాన్వీ యాక్టర్ షాహిద్ కపూర్ ఇంటికెళ్లింది. షాహిద్, ఇషాన్, మీరా రాజ్ పుత్ కోసం వెజ్ బిర్యానీ చేసింది. జాన్వీ చేసిన బిర్యానీ చాలా బాగుందంటూ… వెజ్ బిర్యానీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది మీరా రాజ్ పుత్.

Related posts