telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

మళ్ళీ పుల్వామా తరహా .. దాడులు..: ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

intelligence warning on terrorist attacks

పాక్ ఏజెన్సీ ఐఎస్‌ఐ జైషేమహ్మద్‌, ఐఎస్‌ సంస్థలను ఒక్కటిగా చేసి భారత్‌పై మరిన్ని ‘పుల్వామా’ తరహా దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తోందని భారత్‌లోని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఇందుకోసం ఇప్పటికే ఈ సంస్థకు చెందిన ప్రతినిధులతో ఐఎస్‌ఐ సంయుక్త సమావేశం జరిగేలా చూసిందని తెలిపింది. ఈ రెండు ఉగ్రవాద సంస్థలు ఐఎస్‌ఐతో నిత్యం టచ్‌లో ఉంటున్నాయని కేంద్రహోం శాఖకు పంపిన నివేదికలో స్పష్టం చేసింది.

బాలాకోట్‌ వైమానిక దాడులతో భంగపడ్డ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ మరోసారి చురుకుగా మారినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారత్‌లో పుల్వామా తరహా మెరుపు దాడులు నిర్వహించేందుకు సుశిక్షితులైన ఉగ్రవాదులనే ఎంచుకోవాలని జైషే టాప్‌ కమాండర్లకు మసూద్‌ ఇప్పటికే సమాచారం పంపాడని ఈ నివేదికలో నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

Related posts