telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమన్నా, సత్యదేవ్ వాలెంటెన్స్ గిఫ్ట్…

యంగ్‌ హీరో సత్యదేవ్‌ కెరీర్‌ మొదటి నుంచి విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వచ్చిన జార్జిరెడ్డి సినిమాలో కీలక పాత్ర పోషించిన సత్యదేవ్‌… రీసెంట్‌గా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే డిఫరెంట్‌ సినిమాతో మంచి హిట్‌ కొట్టాడు. ఇప్పుడు చిరంజీవి చేస్తున్న లూసిఫర్‌ రీమేక్‌లోనూ ఛాన్స్‌ కొట్టేశాడు సత్యదేవ్‌. విలన్‌గా లేదంటే సీఎం పాత్రలో సత్యదేవ్‌ కనిపించనున్నట్లు టాక్‌ నడుస్తోంది.  ఇది ఇలా ఉంటే…ప్రేమికుల రోజు సందర్భంగా హీరోలందరూ తమ సినిమాల నుంచి కొత్త కొత్త పోస్టర్లను విడుదల చేస్తున్నారు. మరికొందరు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా చేరారు. సత్యదేవ్ తాజాగా చేస్తున్న సినిమా గుర్తుందా సీతాకాలం సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నారు. ఈ సినిమా కన్నడ హిట్ సినిమా లవ్ మొక్తయైల్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను భావన రవి, నాగ శేఖర్, చింతపల్లి రామారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చాలా రొమాంటిక్‌గా రెడీ చేశారు. ఈ పోస్టర్‌లో తమన్నా, సత్యదేవ్ ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటున్నారు. సత్యదేవ్ తమన్నా చేతులు పట్టుకొని ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ త్వరలో రానుందని ఈ పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమా కోసం సత్యదేవ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి వారి అంచనాలను సత్యదేవ్ అందుకుంటారేమో వేచి చూడాలి. 

Related posts