telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆక్రమిత కశ్మీర్ లో .. ఉగ్రవాదుల ఏరివేత ఆరంభం ..

huge terrorist camps found in kashmir valley

భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులపై భారత సైన్యం ఎదురుదాడి ప్రారంభించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత బలగాలు దాడులు చేశాయి. తంగ్ధార్‌ సెక్టార్‌కు ఎదురుగా ఉన్న నీలం లోయలోని 4 ఉగ్రశిబిరాలపై భారత్‌ బలగాలు శతఘ్నులతో విరుచుకుపడ్డాయి.ఈ ఘటనలో నలుగురైదుగురు పాక్‌ సైనికులతో పాటు 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. పాకిస్థాన్‌ సైన్యానికి చెందిన పోస్టులు కూడా ధ్వంసమైనట్లు తెలిసింది.

బాలాకోట్‌ ఉగ్రశిబిరాలపై దాడి తర్వాత సైన్యం మరో కీలక ఆపరేషన్‌ ప్రారంభించింది. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత్‌లోకి పెద్ద ఎత్తున ఉగ్రవాదులను పంపి పాకిస్థాన్‌ విధ్వంసానికి యత్నిస్తోందన్న నిఘా వర్గాల హెచ్చరికల మధ్య సైన్యం అప్రమత్తమైంది. ఆదివారం ఉదయం తంగ్ధార్‌ సెక్టార్‌లో పాక్‌ సైన్యం జరిపిన దాడుల్లో ఇద్దరు జవాన్లు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారతసైన్యం వెంటనే ప్రతీకార దాడులను చేపట్టింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రశిబిరాలపై దాడులు చేపట్టింది.

Related posts