telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రపతి సంతకంతోనే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం: యనమల

Yanamala tdp

రాష్ట్రపతి సంతకంతోనే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చిందని అన్నారు. రాష్ట్రపతి చేసిన చట్టం, కేంద్ర కమిటీ ద్వారానే అమరావతి రాష్ట్ర రాజధానిగా అవతరించిందని తెలిపారు. ఇప్పుడు రాజధానిని మార్చాలంటే మళ్లీ రాష్ట్రపతి సంతకం తప్పని సరి అని ఆయన అన్నారు.

కేంద్రం చేసిన చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్రం సొంతంగా చట్టం చేయాలనుకుంటే దానికి రాష్ట్రపతి సంతకం తప్పనిసరి అని యనమల చెప్పారు. ఏపీ రాజధాని గుర్తింపుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించిందని తెలిపారు. ఆ కమిటీ అమరావతి ప్రాంతాన్ని సూచించిందని తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకంతో అమరావతి రాజధానిగా ఏర్పాటయిందని చెప్పారు. ఇప్పుడు రాజధానిని మార్చాలంటే రాష్ట్రపతి సంతకం అవసరమని అన్నారు. వైసీపీ ప్రభుత్వ సలహాదారులు ఈ విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు.

Related posts