telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాక్సింగ్ రింగ్‌లో వరుణ్‌తో ఫైట్‌కు రెడీ అవుతున్న నవీన్ చంద్ర

అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నవీన్ చంద్ర. ఆ తరవాత మనోడికి సరైన హిట్టు పడలేదు. దీంతో అవకాశాలు కూడా తగ్గాయి. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేయడం మొదలుపెట్టారు నవీన్. ‘నేను లోకల్’, ‘అరవింద సమేత’ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు. అయితే, ఇప్పుడు వరుణ్ తేజ్‌కు మెయిన్ విలన్‌గా చేస్తున్నారు. బాక్సింగ్ రింగ్‌లో వరుణ్‌తో ఫైట్‌కు సిద్ధమవుతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెండితెరపై కిక్ బాక్సర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయిలో కిక్ బాక్సింగ్‌లో వరుణ్ శిక్షణ తీసుకున్నారు. బల్క్ లుక్‌తో రెడీ అయ్యారు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల విశాఖపట్నంలో ప్రారంభమైంది. అయితే, ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కు విలన్‌గా మరో యంగ్ హీరో నటిస్తున్నారు. సుమారు 45 రోజుల పాటు కష్టపడి ఆయన తన ఫిజిక్‌ను ట్రాన్స్‌ఫాం చేశారు. హైదరాబాద్‌కు చెందిన బాక్సింగ్ కోచ్ పర్యవేక్షణలో కిక్ బాక్సింగ్‌లో శిక్షణ పొందారు. నిర్విరామంగా సాగిన ఈ శిక్షణ అనంతరం ఇటీవల ఆయన వైజాగ్ వెళ్లారు. ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాకు ‘బాక్సర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

Related posts