telugu navyamedia
క్రీడలు

వృధా అయిపోయిన.. రోహిత్ సెంచరీ…

india australia one day match

నేడు జరిగిన ఆస్ట్రేలియా-ఇండియా మొదటి వన్డే మ్యాచ్ లో ఇరు టీం లు మొదటగా తడబడే ఆడాయి. కాకపోతే ఆస్ట్రేలియా టీం నిలదొక్కుకొని 288 పరుగులు చేసింది. దీనిలో చెప్పుకోదగ్గ స్కోర్ ఎవరు చేయకపోయినా.. నిలకడగా ఆడటం తో కొంత మేలు అనిపించారు. ఇక భారత్ టీం విషయానికి వస్తే, మనవాళ్ళు మొదట తడబడితే ఆ మ్యాచ్ అంతే.. అనే విషయాన్నీ మరోసారి నిరూపించారు. ఆస్ట్రేలియా ఇచ్చిన 289 పరుగుల లక్ష్యంతో ఆడటం మొదలుపెట్టిన భారత ఆటగాళ్లు, మొదటి దశకంలోనే వికెట్లు కోల్పోయి విజయం అతిధే అని చెప్పకనే చెప్పారు.

అటువంటి సందర్భంలో క్రేజులోకి వచ్చిన ధోని కాస్త ఆశలు రేకేతించాడు. కానీ చివరికి ధోని కూడా అర్ధ సెంచరీ తో సరిపెట్టుకోవటంతో.. మళ్ళీ నిరాశలో అభిమానులు. అయితే ఈసారి రోహిత్ సెంచరీ తో మెరిపించి, గెలుపు అంచులవరకు తీసుకెళ్లాడు.. అయినా చివరిదాకా పోరాడి, ఓడింది ఇండియా టీం. మొత్తానికి మొదటి వన్డే లో అతిధి ఆస్ట్రేలియా ది పైచేయిగా ఉంది.

Related posts