telugu navyamedia
క్రీడలు వార్తలు

పాకిస్తాన్ చీఫ్ నేషనల్ సెలెక్టర్ పదవి నుంచి మిస్బా ఔట్…

పాకిస్తాన్ ప్రధాన కోచ్ మరియు చీఫ్ సెలెక్టర్ గా మిస్బా-ఉల్-హక్ ఉన్న విషయం తెలిసిందే. అయితేఅతని ఒక సంవత్సరం పనితీరును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సమీక్షించిన నివేదికల తరువాత మిస్బా సెలెక్టర్ పదవి నుండి వైదులుగుతున్నట్లు కేవలం జాతీయ జట్టు ప్రధాన కోచ్ గా కొనసాగనున్నట్లు తెలుస్తుంది.

పాకిస్తాన్ మాజీ టెస్ట్ కెప్టెన్ మిస్బా అక్టోబర్ 14 బుధవారం వర్చువల్ మీడియా విలేకరుల సమావేశం ద్వారా తన జాతీయ పాత్ర నుండి జాతీయ సెలెక్టర్ నుండి అధికారికంగా వైదొలగనున్నారు. గత వారం, అక్టోబర్ 8 న, తన ఏడాది పనితీరు గురించి చర్చించడానికి పిసిబి బోర్డు సిఇఒ వాసిమ్ ఖాన్ మరియు చైర్మన్ ఎహ్సాన్ మణి మిస్బాతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మిస్బాతో పిసిబి యొక్క కొత్త ఎథిక్స్ కోడ్ గురించి చర్చించారు, జాతీయ బోర్డు యొక్క ఏ ఉద్యోగి రెండు ఉద్యోగాలు చేయడానికి అనుమతించబడలేదని అతనికి తెలిపారు. అందువల్ల జింబాబ్వేతో జరగబోయే హోమ్ సిరీస్ ముందు అతను తన నేషనల్ సెలెక్టర్ పదవి నుండి తప్పుకొని జాతీయ జట్టు ప్రధాన కోచ్ గా కొనసాగనున్నాడు.

Related posts