telugu navyamedia
క్రీడలు

ఒలింపిక్స్‌లో ఓడిపోయి రికార్డు సృష్టించిన ఆమె

2020 టోక్యో ఒలింపిక్స్ ట్రాన్స్‌జెండర్లకు ప్రవేశం కల్పిస్తూ కొత్త సంప్రదాయానికి తెరతీసింది. దీంతో న్యూజిలాండ్‌కు చెందిన మహిళా ట్రాన్స్‌జెండర్ లారెల్ హబ్బార్డ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. మహిళల 87 కిలోల వెయిట్‌ లిఫ్టింగ్ విబాగంలో పోటీపడి ఓడిపోయింది. మూడు ప్రయత్నాల్లో విఫలమై వెనుదిరిగింది. ఓడిపోయినా ఒలింపిక్స్‌లో పోటీ పడిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా తనలాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. తన ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్‌గా ఒలింపిక్స్‌లో అవకాశం దక్కినందుకు సంతోషం వ్యక్తం చేసింది. విశ్వ క్రీడల్లో అవకాశమిచ్చిన అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీకి ఆమె కృతజ్ఞతలుతెలిపింది. క్రీడలు అనేవి ప్రతిఒక్కరికి సంబంధించినవి అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

Related posts