హైదరాబాదులో ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో రోడ్లపై నీరు నిలిచి, ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ సాయంత్రం మేఘాలు కమ్మేయడంతో పట్టపగలే చీకటిని తలపించింది. ఆ వెంటనే ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడి వర్షం నగరాన్ని ముంచెత్తింది. దాదాపు గంగసేపు ఏకధాటిగా వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో జంటగరాల్లోని రోడ్లపై వరద నీరు పొంగి పొర్లుతుంది. బంజారాహిల్స్, మెహిదీపట్నం, లంగర్ హైస్, కోఠి, అబిడ్స్, మూసాపేట, జీడిమెట్ల, నల్లకుంట, అంబర్ పేట, నాచారం, కాచిగూడ, పటాన్ చెరు, బోయిన్ పల్లి, చిలకలగూడ, మారేడ్ పల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.