telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాక్టింగ్ నేర్పించండి… భర్తకు జెనీలియా రిక్వెస్ట్

Genelia

ప్రముఖ నటి జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ నటించిన ‘మర్జావా’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్ధార్థ్ మల్హాత్రా, తారా సుతారియా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రితేష్ మరుగుజ్జు విలన్ పాత్రలో కనిపించారు. మిలాప్ జవరే సినిమాను డైరెక్ట్ చేశారు. తన భర్త నటించిన సినిమా కాబట్టి జెనీలియా పాజిటివ్‌‌గా స్పందించారు. ఈ సినిమా తనకు పిచ్చి పిచ్చిగా నచ్చిందని ట్వీట్ చేశారు. ‘సినిమాను నేను చాలా ఎంజాయ్ చేశాను. దర్శకుడు మిలాప్ జవేరీని చూస్తుంటే గర్వంగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా అదరగొట్టాడు. తారా సుతారియా, రకుల్ ప్రీత్ సింగ్ తమ పాత్రల్లో బాగా నటించారు. రితేష్.. నాకు యాక్టింగ్ నేర్పించండి. అన్ని జోనర్లలోనూ మీరు ఇంత బాగా ఎలా నటించగలుగుతున్నారు?’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ సినిమా అష్టదరిద్రంగా ఉందట. సినిమాలో సిద్ధార్థ్, రితేష్ చెప్పే పద్యాలు, శ్లోకాలు తలనొప్పి తెప్పించేలా ఉన్నాయి నెటిజన్లు, పలువురు సినీ విశ్లేషకులు తెలిపారు. భర్తకు సపోర్ట్‌గా జెనీలియా చేసిన ట్వీట్ చూసి చాలా మంది ఫ్యాన్స్ సినిమా చూడటానికి వెళ్లారట. థియేటర్ నుంచి బయటికి వచ్చాక ఎంతో నిరాశచెందారట. సెలబ్రిటీలు చేసే ట్వీట్లు చూసి మోసపోవద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు.

Related posts