telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేడు టి.వి.యస్‌.శాస్త్రి శత జయంతి… సినిమాల నిర్మాణ కార్యక్రమానికి రూపునిచ్చిన వ్యక్తిగా ఖ్యాతి..

movie production specialist tvs sastri jayanthi

నేడు టి.వి.యస్‌.శాస్త్రి శత జయంతి. ఈయన తెలుగు సినిమాల నిర్మాణ కార్యక్రమానికి ఒక క్రమబద్ధమైన రూపునిచ్చిన వ్యక్తిగా ఖ్యాతిగడించారు. జూన్‌ 8, 1920న కృష్ణాజిల్లా గొడవర్రులో జన్మించిన ఆయన 1940లో కొందరు మిత్రులతో కలసి కె.యస్‌.ప్రకాశరావు, జి.వరలక్ష్మి హీరోహీరోయిన్లుగా సినిమా తీద్దామని ముంబాయి వెళ్లారు. ఒక పాట రికార్డింగ్‌తో ఆ సినిమా ఆగిపోవడంతో అక్కడే నాటి హిందీ నటుడు మజర్‌ఖాన్‌ సినిమా కంపెనీలో జనరల్‌ మేనేజర్‌గా చేరారు.

కె.యస్‌.ప్రకాశరావు కోరిక మేరకు ద్రోహి చిత్రనిర్మాణ వ్యవహారాలు చూడటానికి చెన్నై వచ్చారు శాస్త్రి. ఆ తర్వాత ఘంటసాల బలరామయ్యగారి ప్రతిభా సంస్థలో చేరారు. దాంతో ఆయన ప్రతిభాశాస్త్రిగా పాపులర్‌ అయ్యారు. అక్కడ ఉన్నప్పుడే ఆయనకు అక్కినేని నాగేశ్వరరావు సన్నిహిత మిత్రులయ్యారు. 1959లో వాసిరెడ్డి నారాయణరావుతో కలసి శాస్త్రి జయభేరి చిత్రం నిర్మించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన హిందీ చిత్రాలకు అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారాయన. 2007 డిసెంబరు 20న ప్రతిభా శాస్త్రి మృతి చెందారు.

Related posts