telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శివరాత్రికి గన్ తో వచ్చేసిన మాస్ మహారాజ్…

మాస్ మహారాజ్ రవితేజ సినిమా క్రాక్ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. అయితే ప్రస్తుతం రవితేజ చేస్తున్నసినిమా ఖిలాడి. ఈ సినిమా సురేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది. ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన పోస్టర్ ఆ తర్వాత రవితేజ పుట్టినరోజు కానుకగా వచ్చిన గ్లింప్స్ తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక తాజాగా నేడు శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుండి మరో పోస్టర్ వచ్చింది. ఇందులో మాస్ మహారాజ్ చేతిలో గన్ తో కనిపిస్తున్నాడు. అయితే శివరాత్రి సందర్భంగా ఖిలాడీ టీజర్‌ విడుదలవుతుందని అనుకున్న రవితేజ అభిమానులకు కొత్త నిరాశే మిగిలింది అని చెప్పాలి. అయితే పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Related posts