ఏపీనే కాదు దేశాన్నే కరోనా కుదిపేస్తోంది. ఇలాంటి కరోనా కష్ట కాలంలో ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది ఖరీఫ్లో నష్టపోయిన పంటలకు ఇవాళ వైఎస్ఆర్ పంటల బీమా కింద సాయం అందించనుంది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,820.23 కోట్లు జమ చేయనుంది ఏపీ సర్కార్. ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సిఎం కార్యాలయం నుంచి సిఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సిఎం జగన్ బటన్ నొక్కగానే నేరుగా రైతుల ఖాతాల్లో పంటల భీమా జమ కానుంది. అయితే యాస్ తుఫాన్ కారణంగా నేటి పంటల భీమా సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ కు ఉత్తరాంధ్ర జిల్లా అధికారులకు మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పథకం ద్వారా గత రెండేళ్లలో 30.52 లక్షల మంది రూ.3,788.25 కోట్ల లబ్ధి పొందారు.
ప్రచారానికి డబ్బులు లేవు .. కిడ్నీ అమ్ముకుంటా