telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టులో నేడు విచారణ

Supreme Court

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వ తీసుకున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సరి-బేసి విధానం అమలు రోజుల్లో కాలుష్య వివరాలను సీపీసీబీ న్యాయస్థానానికి అందజేసింది. దీనిపై సుప్రీం స్పందిస్తూ సరి-బేసి విధానంతో కాలుష్యంపై ఎలాంటి ప్రభావం లేదని పేర్కొంది. సరి-బేసి విధానం కాలుష్య నియంత్రణకు పరిష్కారం కాదని పేర్కొంది.

కాలుష్య నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 29న మరోసారి కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీచేసింది. అదేవిధంగా ఢిల్లీలో గాలి నాణ్యత పెంపు మార్గదర్శకాలను వారంలోగా రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Related posts