telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతులను బ్లాక్ మెయిల్ చేస్తే కఠిన చర్యలు: మంత్రి ఈటల

Etala Rajender

రైతులను బ్లాక్ మెయిల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. డు ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మాట్లాడుతూ.. ఏవైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని రైసుమిల్లు యజమానులకు సూచించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన తాలు పేరుతో తరుగు తీయవద్దని సూచించారు.

రైతులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతులను ఇబ్బంది పెట్టే ధైర్యం చేస్తారా? అని ప్రశ్నించారు. . ఏం కావాలో ప్రభుత్వంతో కొట్లాడాలి కానీ రైతును ఇబ్బంది పెట్టొద్దన్నారు. రైతును ఇబ్బంది పెడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈటల హెచ్చరించారు.

Related posts