రాహుల్ గాంధికి బదులు, తమకు ఆమోదయోగ్యమైన ఎంతో అనుభవం ఉన్న మరాఠా నాయకుడు, ఎన్‌సిపి అధినేత, శరద్ పవార్ పేరును తెరపైకి తెచ్చింది కాంగ్రెస్. ఆయనైతే అనుభవజ్ఞుడు, వయసులో పెద్దవాడు కావడం వల్ల మిగతా మిత్రపక్షాలు కూడా ఆయన ప్రధాని అభ్యర్ధిగా ఒప్పుకుంటాయనే ఆలోచనలో ఉంది. ఒకవేళ శరద్ పవార్ ను ప్రధానిగా మిత్రపక్షాలు ఒప్పుకోకపోతే, ఆయన పార్టీ ఎన్‌సిపికి మహారాష్ట్రలో ఎక్కువ స్థానాలు రాకపోతే అప్పుడు తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సిఎం మమతా బెనర్జీ పేరును ప్రకటిస్తారని తెలుస్తోంది.
పవార్ తన పార్టీని కాంగ్రెస్ లో కలిపితేనే ఆయన పేరును ప్రకటిస్తామని మెలిక పెట్టినట్లు తెలిసింది. ఇందుకు పెద్దాయన ఒప్పుకుంటారన్న గ్యారెంటీ లేదు. ఈ విషయమై ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు, టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తో కాంగ్రెస్ వర్గాలు చర్చించినట్లు తెలిసింది. ఇదంతా లేకుండా కాంగ్రెస్ 200 స్థానాలు గెలుచుకోగలిగితే, అప్పుడు కాంగ్రెస్ చెప్పిన మాటే వేదం అయ్యే అవకాశాలున్నాయి. అలాంటి పరిస్థితి ఉంటే రాహుల్ గాంధీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
మాయావతి ప్రధాన మంత్రి అవ్వాలన్నా కాంగ్రెస్ మద్దతు అత్యవసరం. కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షాలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టసాధ్యం అందుకు ప్రధాని పదవి చేపట్టాలంటే పార్టీని విలీనం చెయ్యాలనే కండీషన్‌ను కాంగ్రెస్ తెరపైకి తెస్తోందని తెలుస్తోంది. తద్వారా ప్రధానితో సత్సంబంధాలు నెరిపేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వీలవుతోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విలీనం అనే షరతును ఏ ప్రాంతీయపార్టీ కూడా అంగీకరించే అవకాశాలు కనిపించట్లేదు. అయితే తాను ప్రధాని సమరంలో పోటీ కాకుండా తన ఆ గర్భశత్రువు నరేంద్ర మోదీని రాజకీయంగా అంతం చేయటమే ధ్యేయంగా బ్రతుకటానికి కూడా సిద్ధం అయ్యాడు.
వపన్ రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరెక్టర్: షర్మిల