telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

2050 తరువాత మానవజాతికి పెద్ద సవాలు… ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

Elon Musk

ప్రపంచవ్యాప్తంగా జనాభా అంతులేకుండా పెరిగిపోతోంది. ముఖ్యంగా చైనా, భారత్ లలో ఎక్కువ జనాభా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జనాభా గురించి, మన భవిష్యత్ ఎలా ఉండబోతోంది అనే విషయంపై చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అంతులేకుండా పెరిగిపోతున్న మానవ జనాభా 2050 నుంచి తగ్గడం మొదలవుతుందని, వృద్ధులు ఎక్కువవుతారని టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్‌ మస్క్‌ అంచనా వేశారు. 1950లో ప్రపంచ జనాభా 255 కోట్లు దాటిందని, ప్రస్తుత జనాభా 771 కోట్లకు చేరిందని, 2050 కల్లా 934 కోట్లు దాటుతుందని అంచనా వేస్తూ ఎవరో రాసిన వ్యాసాన్ని ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. 2050 తర్వాత జనాభాలో వృద్ధుల సంఖ్య పెరగడం, జననాలు తగ్గడం మానవ జాతి చెడ్డరోజులను ఎదుర్కోబోయే అతి పెద్ద సవాలని ఆ ట్వీట్ లో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై నెటిజన్లలో చర్చ మొదలైంది.

Related posts