telugu navyamedia
news political Telangana

పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి : నాగిరెడ్డి

After 11 Parishat Elections Telangana

తెలంగాణలో పరిషత్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్కువ సమయంలోనే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన అందరికీ నాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఏడు పోలింగ్ బూత్ లలో ఇబ్బందులు ఎదురయ్యాయని అందుకు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోందన్నారు.

ఈనెల 27న కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. 123 ప్రాంతాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా కౌంటింగ్ జరుగుతుందని.. ఒక్కో ఎంపీటీసీకి రెండు కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 32 జిల్లాలలో 123 కేంద్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ మూడు విధాలుగా జరుగుతుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు.

Related posts

ఎన్ .టి రామారావు రాజకీయ ప్రవేశం …తరువాత ఏమి జరిగిందంటే …?

ashok

2050 తరువాత మానవజాతికి పెద్ద సవాలు… ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

vimala p

ఆయనకు కుటుంబం కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యం: నారా బ్రహ్మణి

vimala p