పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించింది. ధురీ స్థానం నుంచి ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ 45,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. మాన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై విజయం సాధించారు.
తమ పార్టీ గెలిచిన తరుణంలో ధురిలో ఏర్పాటు చేసిన విజయోత్సవ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ లో భగవంత్ మాన్ ఆయన తల్లి హర్పాల్ కౌర్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ క్షణంలో కుమారుడి ఒడిలో వాలిపోయారు.
ఈ సందర్భంగా తమ పార్టీ గెలిచిన తరుణంలో ప్రమాస్వీకారంపై పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..రాజ్‌భవన్‌లో కాకుండా భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్‌కలన్‌లో పంజాబ్ సీఎంగా ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు.
రాష్ట్రంలో తమ ప్రభుత్వం.. పాఠశాలలు, వైద్య ఆరోగ్య, క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తుందని మాన్ అన్నారు. “యువత విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండేలా చేస్తాం.. ఒక నెలలో, మీరు మార్పులను గమనిస్తారు” అని మాన్ తన విజయ ప్రసంగంలో చెప్పారు.
పవన్ ఓటమిపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్