telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐష్… చెత్త డ్రెస్‌, మేక‌ప్‌ అంటూ డిజైనర్ పంచ్

Ish

ఐశ్వర్య రాయ్ అందానికి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. 1994లో మాజీ మిస్ వ‌రల్డ్ కిరీటాన్ని అందుకున్న ఐశ్వ‌ర్య‌రాయ్ ప‌లు అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్స్‌లో సంద‌డి చేస్తూ ఉంటుంది. వెరైటీ డ్రెస్‌ల‌లో హోయ‌లు పోతూ వీక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటుంది. చివ‌రిగా ఫ్యాన్నేఖాన్ సినిమాలో న‌టించిన ఐష్ ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం సినిమాలో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతుంది. చోళ మహారాజు భార్య పాత్రలో నటించనున్నారు. ఆమె విలన్‌గా డబుల్ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఐష్ ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనేందుకు పారిస్ వెళ్లారు. లావెండర్ కలర్ దుస్తుల్లో ర్యాంప్ వాక్ చేశారు. అయితే ఐష్ దుస్తులపై ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ అయిన వెండెల్ రోడ్రిక్స్ కామెంట్ చేశారు. “ప్ర‌పంచంలోని అంద‌మైన యువ‌తి ఐశ్వ‌ర్య‌రాయ్‌. ఆమెకి ఇలాంటి చెత్త డ్రెస్‌, మేక‌ప్‌లు వేసి అంద‌విహీనంగా త‌యారు చేశారు. ముందు వెంట‌నే ఆయ‌న‌ని తొల‌గించండి. అంతేకాదు హాలోవీన్ వ‌చ్చే నెల అని ఆయ‌న‌కి చెప్పండి” అని కొంచెం ఘాటుగా స్పందించారు వెండెల్‌. ఐష్ వేసుకున్న డ్రెస్‌ని పారిస్‌కి చెందిన డిజైనర్ జియామ్ బటిస్టా వల్లీ డిజైన్ చేశారు.

Related posts