telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కశ్మీర్ లో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు: ఉండవల్లి

Undavalli Arun kumar

కశ్మీర్ లో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. అక్కడకు ఎవరినీ వెళ్లనీయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో తప్పు లేదని, బీజేపీ పుట్టిందే ఈ సిద్ధాంతంమీద అని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటున్న సమయంలో కశ్మీర్ లో కర్ఫ్యూ కొనసాగడం బాధాకరమని అన్నారు. పరిపాలనలో సీఎం జగన్ అప్రమత్తంగా ఉండాలని ఉండవల్లి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కువైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సూచించారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో ఇన్ని కోట్లు ఆదా అవుతాయని ఊహించలేదన్నారు.

Related posts