telugu navyamedia
telugu cinema news trending

దర్బార్ : దుమ్మురేపుతున్న సూపర్ స్టార్ మాస్ సాంగ్

Darbar

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో మురుగ‌దాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ద‌ర్భార్. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై సుబ‌స్క‌ర‌న్ నిర్మిస్తున్నారు. న‌య‌న‌తార క‌థానాయిక‌. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించారు. చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు.తాజాగా చిత్రం నుండి తొలిపాట‌ని విడుద‌ల చేశారు. ‘దుమ్ము ధూళి’ అంటూ సాగే ఈ పాట నిజంగా దుమ్మురేపుతుంది. ప్ర‌ముఖ గాయ‌కుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ పాట‌ని తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఆల‌పించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ద‌ర్భార్ చిత్రంలో నివేథా థామస్ ఒక ముఖ్య పాత్రలో నటించింది. సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా విడుద‌లైన సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.

Related posts

“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు”పై అప్డేట్ ఇచ్చిన వర్మ

vimala p

వివాదాస్పదమైన “కాకటైల్” పోస్టర్ …

vimala p

నేను అజ్ఞాతంలోకి వెళ్ళలేదు.. : టీవీ9 రవిప్రకాష్

vimala p